దోరగా వేయించిన శొంటి, పిప్పళ్ళు, మిరియాలు, నల్లుప్పు, ఇంగువ..వీటిని ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకొని మంచినీటితో మెత్తగా నూరి ఒక పాత్రలో పొయ్యాలి. అందులో దేశవాళి ఆవుమూత్రం పదహారు లీటర్లు, దేశవాళి ఆవునెయ్యి నాలుగు లీటర్లు పోసి పదార్ధమంత కలబెట్టి పొయ్యి వెలిగించాలి. చిన్న మంటపైన నెయ్యి మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి చల్లార్చి వడపోసుకోవాలి. ఈ నెయ్యి రెండు పూటలా 10 -20 గ్రాముల మోతాదుగా లోనికి సేవిస్తూ ఉంటే పిచ్చి, ఉన్మాదం, అపస్మారం, మతిస్థిమితం లేకపోవడం, మందబుద్ధి మొదలైన సమస్యలు క్రమంగా నివారించబడుతాయి.
మధుమేహానికి మోదుగపూలు
అలహాబాదులోని డా. పన్నాలాల్ గర్ అనే వైద్యుడు పరిశోధించి తెల్పిన చికిత్స ఇది. శుక్లపక్షమిలో వచ్చిన అనురాధ నక్షత్రం నాడు ఉదయమే మోదుగ చెట్టు వద్దకు పోయి ప్రదిక్షనము చేసి, పూజించి, నైవేద్యము పెట్టి, సంకల్పాన్ని చెప్పి మోదుగాపూలను ఒకేసారి కోసుకొని తెచ్చుకోవాలి. వాటిని శుబ్రమైన నీడలో గాలి తగిలేటట్టుగా ఎండబెట్టాలి.
మొదటి రోజు ఒక పువ్వును ఒక పెద్ద కప్పు నీటిలో వేసి రాత్రి నుండి ఉదయం వరకు నానబెట్టి, ఉదయం పూట పువ్వును నీటితో పిసికి బట్టలో వడపోసుకొని, ఆ నీటిని పరగడుపున తాగాలి. రెండవ రోజు రెండు పూలను, మూడవ రోజు మూడు పూలను, నాలుగవ రోజు నాలుగు పూలను, ఐదవ రోజు ఐదు పూలను పెంచుతూ పూలతోపాటు కొంచెం నీటిని కూడా పెంచుకోవాలి.
ఆరవ రోజు నుండి ఒక్కొక్క పూవు తగ్గిస్తూ అనగా ఆరవ రోజు నాలుగు పూలను, ఏడవ రోజు మూడు పూలను, ఎనిమిదవ రోజు రెండు పూలను, తొమ్మిదో రోజు ఒక పూవును ఉపయోగించాలి.
ఇలా నలబైఒక్క రోజులు చేస్తూ మధుమేహ పరీక్షలు చేయించుకుంటూ వాడుతుంటే మధుమేహం హరించిపోతుంది.
మద్యం త్రాగే అలవాటును మాన్పించండిలా
ఆముదపు ఆకు పసరు తీసి ముక్కులో రెండు చుక్కలు ఉదయం పరగడుపున, వారానికి ఒకసారి చొప్పున వరుసగా నాలుగుసార్లు పొయ్యాలి.